శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2024 (18:53 IST)

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

Venkatesh
Venkatesh
వెంకటేష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ అద్భుతమైన హ్యాట్రిక్ కొలాబరేషన్ తర్వాత మోస్ట్ ఎవైటెడ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ చాలా క్యురియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఈ డైనమిక్ కాంబినేషన్ ఇప్పటికే రెండు పెద్ద హిట్‌లను అందించింది. బ్లాక్‌బస్టర్‌లను అందించడంలో అనిల్ రావిపూడి ది స్పెషల్ రికార్డ్‌. అప్ కమింగ్ మూవీ ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని హామీ ఇవ్వడంతో పాటు, యూనిక్ ట్రైయాంగిలర్ క్రైమ్ నెరేటివ్ ని అందిస్తుంది. రీసెంట్ గా రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' టైటిల్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ రోజు ఫైనల్ షెడ్యూల్ అరకులో ప్రారంభమైయింది. మేకర్స్ రిలీజ్ చేసి వీడియోలో స్కూల్ స్టూడెంట్స్ హీరో వెంకటేష్ గారికి సాదరంగా స్వాగతం పలకడం, ఆయన ఆప్యాయంగా పలకరించడం అందరినీ ఆకట్టుకుంది.  
 
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 'సంక్రాంతికి వస్తున్నాం' 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.