సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 జనవరి 2023 (19:14 IST)

ఆస్కార్ 2023 కోసం షార్ట్‌ లిస్టయిన ది కాశ్మీర్ ఫైల్స్

The Kashmir Files
The Kashmir Files
 అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) ఈ ఏడాది ఆస్కార్‌ లకు అర్హత సాధించిన 301 చలన చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇండియన్ అఫీషియల్ ఎంట్రీ కాకుండా, సంచలనాత్మక, వివాదాస్పద చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్‌తో సహా మరో నాలుగు చిత్రాలు ఇందులో ఉన్నాయి.
 
ది కాశ్మీర్ ఫైల్స్ జాబితాలోకి రావడం పట్ల దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ది కాశ్మీర్ ఫైల్స్ ఆస్కార్ కోసం TheAcademy చే షార్ట్‌లిస్ట్ చేయబడింది. ఓటింగ్‌ కు అర్హత పొందింది. 300 చిత్రాలలో నామినేట్ చేయబడింది. జనవరి 12 నుంచి 17వ తేదీ మధ్య ఓటింగ్ జరగనుంది.” అని ట్వీట్ చేశారు.
విడుదలైన తొలిరోజుల్లో సినిమాకు చాలా తక్కువ స్క్రీన్‌లు కేటాయించారు. అయితే, ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్‌ గా నిలిచింది ఇండియన్  సినిమాలో అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
 
ఈ కథ 1990లలో భారత పాలిత కాశ్మీర్ నుండి కాశ్మీరీ హిందువుల వలసలు, నాడు జరిగిన మారణహోమాన్ని చిత్రీకరించింది.
అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి కలిసి నిర్మించారు
 
ఆస్కార్ చివరి నామినేషన్ల జాబితాను జనవరి 24న ప్రకటిస్టారు. మార్చి 12న హాలీవుడ్‌ లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్ వేడుక ప్రత్యక్ష ప్రసారం కానుంది.