శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 9 మార్చి 2017 (11:10 IST)

మగాళ్ళను మహిళలు సన్నీలా సుఖపెట్టాలన్న వర్మ.. కన్నుగీటిన ఎమోజీతో పోర్న్ స్టార్ ఆన్సర్

ప్రపంచంలోని పురుషులకు మహిళలు పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌లా సుఖపెట్టాలంటూ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మహిళా దినోత్సవం రోజున చేసిన సెక్సీయస్ట్ ట్వీట్స్ ఇపుడు పెను దుమారం రేపుతోంది.

ప్రపంచంలోని పురుషులకు మహిళలు పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌లా సుఖపెట్టాలంటూ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మహిళా దినోత్సవం రోజున చేసిన సెక్సీయస్ట్ ట్వీట్స్ ఇపుడు పెను దుమారం రేపుతోంది. ప్రపంచం మొత్తం 'మహిళాసాధికారత, సమాన అవకాశాలు, ఉన్నతస్ధాయి' అని మాట్లాడుతుండగా, రాంగోపాల్ వర్మ మాత్రం 'ప్ర‌పంచంలో ప్ర‌తి మ‌హిళ‌.. స‌న్నీ లియోన్‌ లాగా పురుషుల‌కు సంతోషాన్నివ్వాల‌ని కోరుకుంటున్న‌ా'నని పేర్కొన్నారు. 
 
దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక నెటిజన్ వర్మ ట్వీట్‌పై ధ్వజమెత్తుతూ 'నీ తల్లి, కుమార్తెకు కూడా ఇలాగే చెబుతావా?' అని ప్రశ్నించగా, మరో యువతి 'నీ తల్లిని కూడా ఇలాగే అడుగుతావా?' అని నిలదీసింది. అయితే ఈ ట్వీట్‌పై సన్నీ లియోన్ కూడా స్పందించడం విశేషం. తన రిప్లైలో ఎలాంటి వ్యాఖ్య చేయని సన్నీ లియోన్ కొంటెగా కన్నుగీటిన ఎమోజీని... 'బాబూ! నీకో దండం' అంటూ మూడు నమస్కారాల ఎమోజీలను పోస్టు చేసింది.