బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శనివారం, 5 ఫిబ్రవరి 2022 (11:15 IST)

టిక్ టాక్ దుర్గారావు దూసుకుపోతున్నాడు...

టిక్ టాక్ ఎంతోమంది స్టార్లుగా మార్చింది. అంతే కాదు కొంతమంది బుల్లితెరపైకి, మరికొంతమంది వెండితెరపైకి కూడా తీసుకెళ్ళింది. టాలెంట్ ఉంటే అవకాశాలు ఏ విధంగానైనా వస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా అందరూ గతంలో భావించారు. అందులో ప్రథముడిగా చెప్పుకోవాల్సింది తెలుగోడు దుర్గారావు.

 
ఇతని ఇంటి పేరే టిక్ టాక్ దుర్గారావుగా మారిపోయింది. తన సతీమణితో కలిసి వెరైటీ డ్యాన్సులు వేస్తూ లక్షలాదిమంది అభిమానులు సంపాదించుకున్నాడు దుర్గారావు. తన హావభావాలు, తెలిసీతెలియని డ్యాన్సులతోనే మంచి పేరును సంపాదించుకున్నాడు.

 
అయితే ఈమధ్య దుర్గారావు ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలను మాత్రమే చేస్తున్నాను. ఆ వీడియోలు నాకు 2 లక్షల దాకా తెచ్చిపెడుతున్నాయి.

 
అలాగే మాటీవీ, జిటీవీ లాంటి ఛానళ్ళలోను కొన్ని కార్యక్రమాలను చేస్తున్నాను. మరికొన్ని కార్యక్రమాలకు నన్ను, మా ఆవిడను ఆహ్వానిస్తున్నారు. అక్కడ డబ్బులు వస్తోంది. అసలు చెప్పాలంటే జబర్దస్ ఆర్టిస్ట్‌ల కన్నా నా ఆదాయం ఎక్కువేమో అంటున్నాడు దుర్గారావు.