గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (08:31 IST)

పెళ్ళికూతురు అయిన బాల నటి సుహాని కలిత

suhani
బాలనటిగా తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సుహాని కలిత ఇపుడు ఓ ఇంటికి కోడలైంది. యువర్స్ ఈవెంట్‌ఫిల్లి సీఈవో పెళ్లాడింది. అలాగే, హీరోయిన్‌గా రెండు సినిమాలు చేసింది. ఢిల్లీకి చెందిన మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో వివాహం చేసుకుంది. ఈ వివహానికి బంధు మిత్రుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. 
 
'మనసంతా నవ్వే సినిమా చూసిన వారు అందులోని "తూనీగా.. తూనీగా" సాంగ్‌ను మర్చిపోవడం కష్టం. ఆ పాటలో నటించిన సుహాని తాజాగా పెళ్లి చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన సంగీత కళాకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాను వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని 'యువర్స్ ఈవెంట్‌ఫుల్లీ' అనే కంపెనీకి విభర్ సీఈవో అని సమాచారం. 
 
ఈ వివాహానికి కొద్దిమంది బంధుమిత్రులు, ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు. సుహాసినివివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తిరుగుతుండగా... 'మీరేనా.. గుర్తించలేకపోయాం' అంటూ వివాహ శుభాకాంక్షలు చెబుతున్నారు. 
 
సుహాని బాలనటిగా 'బాల రామాయణం', 'గణేశ్', 'ప్రేమంటే ఇదేరా', 'ఎదురులేని మనిషి', 'ఎలా చెప్పను' తదితర సినిమాల్లో నటించింది. 2008లో 'సవాల్' సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత 'స్నేహగీతం' సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత  సినిమాలకు దూరమైంది.