శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (13:06 IST)

మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చినట్టేనా?

manchu manoj
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోమారు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేతలైన దివంగత భూమా నాగిరెడ్డి భూమా శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ వివాహం చేసుకోబోతున్నట్టు సమాచారం. వీరిద్దరూ కలిసి సికింద్రాబాద్‌లోని గణేశ్ మండలంలో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు మనోజ్ సమాధానం దాటవేశారు. 
 
పెళ్లితో సహా పలు ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. అయితే, త్వరలోనే తన వివాహం, రాజకీయ ప్రవేశంపై ఓ క్లారిటీ ఇస్తానని మాత్రం చెప్పారు. అలాగే, ఆయన నటిస్తున్న "అహంం బ్రహ్మస్మి" సినిమా జాప్యానికి కూడా కారణం చెప్పారు. కరోనా కారణంగానే ఈ సినిమా ఆగిందని చెప్పారు. ప్రస్తుతం తాను, ఆ సినిమా దర్శకుడు వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్టు చెప్పారు.