సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శనివారం, 11 జూన్ 2016 (20:45 IST)

సుడిగుండంలో నిర్మాత... హీరోను సీన్ డామినేట్ చేస్తే కథ మార్చాల్సిందే!

తెలుగు సినిమా కథానాయకులు ఆలోచనలు ట్రెండ్‌ను బట్టి మారుతుండాలి. లేదంటే ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారవుతుంది. అయితే, కొంతమంది హీరోలు మారాలనుకున్నా.. అందుకు దర్శకులు కూడా తోడుకావాలి. సినిమా

తెలుగు సినిమా కథానాయకులు ఆలోచనలు ట్రెండ్‌ను బట్టి మారుతుండాలి. లేదంటే ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారవుతుంది. అయితే, కొంతమంది హీరోలు మారాలనుకున్నా.. అందుకు దర్శకులు కూడా తోడుకావాలి. సినిమా చేసేటప్పుడు హీరోకు కథ గురించి... దర్శకుడు గురించి కూలంకషంగా తెలియాల్సి వుంటుంది. లేదంటే.. ఏమి చేస్తున్నాడనేది గందరగోళంగా తయారవుతుంది. ఇటీవల హీరోల అంచనాలు తారుమారువుతున్నాయి. ప్రధానంగా కాంబినేషన్‌లనే చూసుకుంటున్నారు. వాటి నుంచి బయట పడాలని.. సీనియర్‌ నిర్మాతలే వెల్లడిస్తున్నారు.
 
కథే హీరో..
ఈ మాట.. చాలామంది చెబుతుంటారు. పెద్ద హీరో నుంచి చిన్న హీరో చిత్రాలకు కథేమిటి? అని అడిగితే.. మామూలు కథే.. ట్రీట్‌మెంట్‌ కొత్తగా ఉంటుంది.. అసలు హీరో కథే.. అంటూ కల్లబొల్లి మాటలు పైకి చెబుతారు. కానీ సెట్‌లోకి వెళ్ళాక.. చాలా తంతు ఉంటుంది. కథానాయకుడికి నచ్చిన సీన్‌ లేదంటే.. వెంటనే సీన్‌ మార్చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పటికప్పుడు రచయితలను ఫోన్‌లో కలుసుకుని.. వెంటనే స్క్రిప్ట్‌ను మారుస్తుంటారు దర్శకుడు. ఇటీవలే ఓ ప్రముఖ హీరో నటిస్తున్న చిత్రంలో జరిగిన సంఘటన ఇది. 
 
సదరు సీన్‌లో హీరోయిన్‌ డామినేటెట్‌గా ఉండటంతో దాన్ని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ప్రముఖ కమేడియన్‌ కూడా ఇదే బాటలో పట్టాడు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అయిన ఓ ప్రముఖ కమేడియన్‌ కూడా.. తనకంటే సీన్‌ డామినేట్‌ చేస్తుంది.. చుట్టూ ఆర్టిస్టులు తనమీద కౌంటర్‌ వేయడం ఆయనకు నచ్చలేదు. దాంతో అప్పటికప్పుడు షాట్‌ను ఆపేసి... 2 గంటలపాటు షూటింగ్‌ ఆగేల చేయడం ఆయనకే చెల్లింది. ఒకప్పటి ప్రముఖ దర్శకుడు.. ఇప్పుడు పెద్దగా హిట్‌లేకపోవడంతో.. తను ఎన్ని చెప్పినా.. కమేడియన్‌ వినేస్థితిలో లేడు. వెనువెంటనే రైటర్స్‌ను కాంటాక్ట్‌ చేసి.. సీన్‌ మొత్తాన్ని మార్చేయాల్సివచ్చింది. దాంతో అసలు షూటింగ్‌ ఆగిపోవడం.. ఆర్టిస్టులు ఖాళీగా ఉండాల్సిరావడం జరిగింది..
 
విలేజ్‌ విదేశాల్లో..
ఇటీవలే హిట్‌ అయిన రెండక్షరాల సినిమా... అందులో అందరూ మేథావులే.. దాని కోసం నిర్మాత ఖర్చుకు వెనుకాడకుండా చాలా వెచ్చించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ కాబట్టి.. దానికి సంబంధించిన సీన్లు.. నేటివిటీ దెబ్బతినకుండా.. గ్రామంలోనే తీయాల్సి ఉంది. అప్పుడే సీన్‌ బాగా పండుతుంది. అనుకున్నవిధంగా అక్కడ సీన్లు తీశారు. కానీ హీరోకు ఎందుకో విదేశాల్లో తీయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే దర్శకుడికి చెప్పడం.. నిర్మాత కూడా కాదనలేక.. గ్రామీణ సీన్లు కోసం విదేశాల్లో తీశారు. దాదాపు 25 రోజులు అక్కడ తీశాక.. రష్‌ చూసుకున్నాక.. తెలిసిందేంటే.. తెలుగు నేటివిటీ.. అనుకున్నట్లు కన్పించలేదు. 
 
దాంతో దాన్నంతా తీసేసి.. అంతకుముందు కోస్తాలో తీసిన షాట్‌ను కొన్ని చొప్పించి.. మరలా అక్కడికి వెళ్ళి తీయడం జరిగింది... ఇలాంటి సంఘటనలు ఎన్నో చిత్రసీమలో జరుగుతుంటాయి. అందుకు ఎవర్ని బాధుల్ని చేయాలి. బలయ్యేది నిర్మాతే. అందుకే ఇటీవలే ఓ ప్రముఖ నిర్మాత తాను ఇప్పటి పరిస్థితుల్లో సినిమా తీసే స్థితిలో లేనని చెప్పి మిన్నకుండిపోయాడు. ఒకప్పటి నిర్మాతకూ ఇప్పటి నిర్మాతకూ చాలా తేడావుంది. నిర్మాత కేవలం క్యాషియర్‌గానే హీరోలు, దర్శకుడు చూస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. లేదంటే నిర్మాత అనేవాడు ముందు ముందు కనుమరుగైపోతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.