శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 మే 2018 (17:20 IST)

మేము జస్ట్ నిమిత్తమాత్రులం.. మళ్ళీ ఇది రిపీట్ చేయగలమా? నాగ్ అశ్విన్

మహానటి విజయంపై ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తొలిసారి స్పందించారు. 'మహానటి' సినిమా ఘన విజయమైన సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ కలిసి ఆదివారం చిత్ర దర్శక నిర్మాతలను సత్కరించారు.

మహానటి విజయంపై ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తొలిసారి స్పందించారు. 'మహానటి' సినిమా ఘన విజయమైన సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ కలిసి ఆదివారం చిత్ర దర్శక నిర్మాతలను సత్కరించారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, 'అందరూ ఇలా మెచ్చుకుంటుంటే ఈ సినిమా నేను చేసిందేనా అనిపిస్తోంది. ఇట్స్ సంథింగ్ బియాండ్ ఐ ఫీల్. వి ఆర్ స్టాండింగ్ ఆన్ షోల్డర్స్ అఫ్ లెజెండ్స్, నిజాయితీగా హానెస్ట్‌గా వి టచ్డ్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా.
 
యన్.టి.ఆర్‌గారు, ఏ.యన్.ఆర్‌గారు, సావిత్రి‌గారు, కె.వి రెడ్డి‌గారు, ఎల్.వి ప్రసాద్‌గారు వంటి లెజెండ్స్ ఉన్నారు. అందుకే అందరూ ఇంత ఇలా రియాక్ట్ అవుతున్నారు. ఇది వారి విజయం. మేము జస్ట్ నిమ్మిత్తమాత్రులం. ఇది ఇండస్ట్రీ తరపున సావిత్రిగారికి ఇచ్చే నివాళి. సావిత్రిగారి లైఫ్ స్టోరీ డెసెర్వ్స్ టు బి ఏ సూపర్ హిట్. చాలా రెస్పాన్సిబిలిటీ, భయంతో చేశాము. అన్నీ కలిసొచ్చాయి సావిత్రిగారి ఆత్మ మమ్మల్ని నడిపించిందేమో అనిపిస్తోంది. మళ్ళీ ఇది రిపీట్ చేయగలమో లేదో తెలియదు. వి ఆర్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ థిస్ జర్నీ. ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేస్తున్న అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు' అని నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డారు.