సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 మే 2018 (15:09 IST)

"మహానటి" బ్లాక్‌బస్టర్.. అల్లు అరవింద్ డిన్నర్ పార్టీ .. ఎందుకు?

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరక్కిన చిత్రం "మహానటి". అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఈనెల 9వ తేదీన విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చ

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరక్కిన చిత్రం "మహానటి". అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఈనెల 9వ తేదీన విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుని, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
 
ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందంటూ సినీ ప్రముఖుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు అందరూ ప్రశంసల వర్షం కుపిస్తున్నారు. ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తన నివాసంలో డిన్నర్‌ పార్టీ ఏర్పాటుచేశారు.
 
ఈ పార్టీకి దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఈ విషయాన్ని బన్నీ ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ పార్టీ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. 
 
'మహానటి' విజయవంతం అయిన సందర్భంగా మా నాన్న ఎంతో ప్రేమతో తన స్నేహితుడు అశ్వనీదత్‌ కోసం‌ ఈ ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు, చిత్రబృందానికి హ్యాట్సాఫ్‌' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వేడుకలో కీర్తిసురేశ్‌, విజయ్‌ దేవరకొండ, నాగ్‌ అశ్విన్, అశ్వనీదత్‌, ఆయన కుమార్తెలు ప్రియాంక దత్‌, స్వప్న దత్‌‌ తదితరులు పాల్గొన్నారు. 
 
అయితే, మహానటి విజయవంతమైతే అల్లు అరవింద్ పార్టీ ఇవ్వడం వెనుక మతలబు లేకపోలేదు. ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ కుమార్తెలైన ప్రియా దత్, స్వప్న దత్‌లు నిర్మాతలుగా మారి మహానటి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర నిర్మాణంలో అల్లు అరవింద్‌కు కూడా భాగస్వామ్యం ఉందనే గుసగుసలు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్నాయి.