గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2017 (12:56 IST)

సంక్రాంతికి వస్తోన్న మాస్ మహారాజ "టచ్ చేసి చూడు''

రాజా ది గ్రేట్‌తో కలెక్షన్లు కురిపించిన రవితేజ.. ప్రస్తుతం టచ్ చేసి చూడు అంటున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ సినిమా ద్వారా కామెడీ, మాస్, యాక్షన్ వంటి అన్ని కోణాల్లో ప్రేక్షకులను కట్టిపడేశఆడ

రాజా ది గ్రేట్‌తో కలెక్షన్లు కురిపించిన రవితేజ.. ప్రస్తుతం టచ్ చేసి చూడు అంటున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ సినిమా ద్వారా కామెడీ, మాస్, యాక్షన్ వంటి అన్ని కోణాల్లో ప్రేక్షకులను కట్టిపడేశఆడు. తాజాగా విక్రమ్‌ సిరికొండ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న టచ్ చేసి చూడు సినిమాలో రవితేజ నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
 
లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా వక్కంత వంశీ కథను అందిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రీతమ్స్‌ సంగీతం సమకూర్చుతున్నారు. 
 
"రాజా ది గ్రేట్" తర్వాత వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇక సంక్రాంతి బరిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కూడా వుంది.