బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (17:10 IST)

టచ్ చేసి చూడు అంటోన్న మాస్ మహారాజ.. ఫస్ట్ లుక్ అదుర్స్..

ఎవడో ఒకడో సినిమాకు తర్వాత ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజు రవితేజ టచ్ చేసి చూడు అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బెంగాల్ టైగర్ సినిమాతో మోస్తరుగా మంచిమార్కులు కొట్టేసిన రవితేజకు 2016 అంతగా

ఎవడో ఒకడో సినిమాకు తర్వాత ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజు రవితేజ టచ్ చేసి చూడు అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బెంగాల్ టైగర్ సినిమాతో మోస్తరుగా మంచిమార్కులు కొట్టేసిన రవితేజకు 2016 అంతగా కలిసిరాలేదు. మంచి హిట్స్ అతని ఖాతాలో లేకపోవడానికి తోడు.. మంచి హిట్‌తో ముందుకు రావాలని ఇన్నాళ్లు వెయిట్ చేసిన రవితేజ ప్రస్తుతం టచ్ చేసి చూడు చిత్రంతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. 
 
తాజాగా రవితేజ-రాశిఖన్నా-లావణ్య త్రిపాఠి కాంబినేషన్‌లో రానున్న ఫిల్మ్ 'టచ్ చేసి చూడు'. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌తో కూడిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో రిలీజైంది. విక్రమ్ సిరి డైరెక్షన్‌లో రానున్న ఫిల్మ్‌ని నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. అంతా ఓకే అయితే ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. 
 
ఏడాది తర్వాత మాస్ రాజా కనిపించడంతో టచ్ చేసి చూడు పోస్టర్‌ను ప్రేక్షకులు షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు. ఈ లుక్‌లో రవితేజ స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా రవితేజకు హిట్ సంపాదించిపెడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.