గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (16:46 IST)

విజయ్ సేతుపతి మా హిజ్రాల పరువు తీసాడు... వెంటనే అరెస్ట్ చేయండి

వరుస విజయాలతో తమిళ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న స్టార్ హీరో విజయ్‌ సేతుపతిని అరెస్టు చేయాలని పలు హిజ్రా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఇటీవల విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన 'సూపర్ డీలక్స్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాకుండా అభినయం చక్కగా ఉందంటూ విమర్శకులు, ప్రముఖులు నటీనటులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 
 
ఈ సినిమాలో విజయ్ సేతుపతి హిజ్రా పాత్రలో నటించాడు. హిజ్రా పాత్రలో డబ్బుల కోసం పిల్లల్ని అపహరించి, మరొకరికి అమ్మేసే సన్నివేశం ఉంది. ఈ సన్నివేశం పట్ల పలు హిజ్రా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. సినిమాలో విజయ్ పిల్లలని కిడ్నాప్ చేశారని, హిజ్రాలు ఎప్పుడైనా అలాంటి పనులు చేసారా అని ప్రశ్నించారు. విజయ్‌ సేతుపతిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సినిమాతో విజయ్ సేతుపతిపై తమకు ఉండే అభిమానం పోయిందని వారు పేర్కొన్నారు.