శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (10:52 IST)

విజయ్ సినిమా శాటిలైట్ హక్కుల రేట్ వింటే భయపడతారట...

ప్రస్తుతం తన 63వ సినిమా షూటింగులో బిజీగా వున్న విజయ్... ఈ సినిమాకి అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ క్రీడా కోచ్‌గా కనిపించనున్నాడు. గతంలో అట్లీ కుమార్.. విజయ్ కాంబినేషన్‌లలో తెరకెక్కిన 'తెరి', 'మెర్సల్' భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో కొత్త చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
 
ఈ భారీ అంచనాలకు తగ్గట్లే... ఈ సినిమా శాటిలైట్ హక్కుల విషయంలోనూ ఛానల్‌ల మధ్య గట్టి పోటీ నెలకొని... ఎట్టకేలకు సన్ టీవీ వారు శాటిలైట్ హక్కులను దక్కించుకున్నట్టుగా సమాచారం. శాటిలైట్ హక్కులపరంగా కోలీవుడ్‌లో ఇంతవరకూ అత్యధిక రేటుకు అమ్ముడైన సినిమా ఇదేననే టాక్ అక్కడ బలంగా వినిపిస్తోంది. ఇందులో విజయ్ సరసన నయనతార కథానాయికగా నటిస్తుండగా ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నారు.
 
మరి ఇన్ని భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఇంకెంత భారీ హిట్ సాధించబోతోందో... తెలుసుకోవాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే.