శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (19:04 IST)

అనసూయ హ్యాట్రిక్ కొడుతుందా...?

రాజేష్‌ నాదెండ్ల దర్శకత్వంలో అనసూయ ప్రధాన పాత్ర పోషిస్తునన్న చిత్రం ‘కథనం’. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, ‘వెన్నెల’ కిషోర్, ‘పెళ్లి’ ఫేమ్ పృథ్వీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్‌ పతాకాలపై బట్టేపాటి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల విడుదల చేయడం జరిగింది.
 
ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్‌ నాదెండ్ల మాట్లాడుతూ – క్షణం, రంగస్థలం’ తర్వాత అనసూయగారికి ‘కథనం’ సినిమా హ్యాట్రిక్‌ అందించచబోతుని అన్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. నరేంద్రరెడ్డిగారు పంపిణీదారునిగా ఏ సినిమా చేసినా హిట్ అవుతుంది‌. ఆయనది లక్కీ హ్యాండ్‌ అని అన్నారు. ‘‘అనసూయగారి కెరీర్‌లో ఇదొక బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నరేంద్ర రెడ్డి.