గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (13:06 IST)

అప్పట్లో హిట్ ఇచ్చాడు... మళ్లీ అదే ఆశతో యంగ్ హీరో

'జయం' సినిమాతో తెరంగేట్రం చేసిన నితిన్ కెరీ‌ర్‌లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'గుండె జారి గల్లంతయ్యిందే' ముందు వరుసలో కనిపిస్తుంది. ఈ ప్రేమకథా చిత్రం నితిన్‌ను యూత్‌కి మరింత చేరువ చేసింది. అలాగే ఈ సినిమా దీని దర్శకుడు విజయ్ కుమార్ కొండాకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే దర్శకుడితో కలిసి మరో సినిమా చేయడానికి నితిన్ రెడీ అవుతున్నాడనే వార్త బలంగా వినిపిస్తోంది.
 
ఈమధ్య చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌ని... దర్శకుడు విజయ్ కుమార్ కొండా.. కలిసి ఒక కథ వినిపించగానే, ఆయన ఓకే చెప్పేసాడనీ... కథా కథనాల్లోని కొత్తదనమే అందుకు కారణమనీ చెబుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి 'భీష్మ' సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లే పనిలోవున్న నితిన్... ఆ తర్వాత విజయ్ కుమార్ కొండాతోనే సినిమా చేయనున్నారట.