శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (11:26 IST)

విజయ్ దేవరకొండ సరసన నయనతార?

కెరీర్‌ను మొదలుపెట్టినప్పటి నుండే దూకుడు మీదున్న విజయ్ దేవరకొండ... మూడు.. నాలుగు హిట్‌లు సాధించనప్పటి నుంచి ఇతర భాషా చిత్రాల మీద తన మార్కు విజయాన్ని సాధించి.. అక్కడ కూడా తన మార్కెట్‌ను పెంపొందించుకోవడానికి ఉత్సాహం చూపుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఒక తమిళ సినిమా చేసేందుకు ఆయన సిద్ధం అవుతున్నాడు. అయితే... ఈ సినిమా ద్వారా ఒక తమిళ యువ దర్శకుడు పరిశ్రమకు పరిచయం కానున్నాడని చెబుతున్నారు.
 
కాగా... ఈ సినిమాలో నయనతార చేయనుందనే టాక్ కోలీవుడ్‌లో ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. కథ.. అందులోని తన పాత్ర నచ్చితే యువ కథానాయకుల సరసన నటించడానికి కూడా ఎంతమాత్రం వెనుకాడని నయనతార తమిళ.. తెలుగు భాషలలో రూపొందనున్న ఈ సినిమాలో కథానాయికగా నటించనుందా..? లేదంటే మరేదైనా కీలకమైన పాత్రలో కనిపించనుందా? అనే విషయంతోపాటు అసలు ఇందులో వాస్తవమెంత అనే విషయం కూడా క్లారిటీ రావలసి ఉంది.