శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (13:36 IST)

'గజదొంగ' భార్యగా పాయల్ రాజ్‌పుత్...(video)

తెలుగు చిత్రపరిశ్రమలో బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే 'మహానటి' సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా 'మహానటి' చిత్రం వచ్చింది. ఆ తర్వాత స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత, రాజకీయ చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్ కథానాయుకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాలు రాగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పాదయాత్ర ఆధారంగా చేసుకుని 'యాత్ర' చిత్రం వచ్చింది. వీటిలో 'మహానటి', 'యాత్ర' చిత్రాలు సూపర్ హిట్‌ సాధించి, కాసుల వర్షం కురిపించాయి. 
 
ఈ నేపథ్యంలో తెలుగు వెండితెరపై మరో బయోపిక్ రానుంది. 1980-90 దశకంలో స్టూవర్టుపురం గజదొంగగా చెలామణి అయిన టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం తెరకెక్కనుంది. ఈయన ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, దొంగతనాలు, దోపిడీలు చేయడంలో ఆరితేరాడు. 
 
ఇపుడు ఈయన జీవిత చరిత్ర ఆధారంగా టైగర్ నాగేశ్వర రావు అనే టైటిల్‌తో చిత్రం నిర్మితంకానుంది. ఈ చిత్రంలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించనుండగా, హీరోయిన్‌గా ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ నటించనుంది. ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందించనున్నారు.