మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (15:59 IST)

దర్శకుడు - నిర్మాతల మధ్య కోల్డ్‌వార్ : భారతీయుడు -2 షూటింగ్‌కు బ్రేక్

సంచలన దర్శకుడు ఎస్. శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం "భారతీయుడు-2". ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఫస్ట్ లుక్‌ను కూడా దర్శకుడు రిలీజ్ చేయగా, అది ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకర్షించింది. 
 
కానీ, తొలి షెడ్యూల్‌ సమయంలో ఈ చిత్రం షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. దర్శక నిర్మాతల మధ్య బడ్జెట్ కారణంగా వచ్చిన మనస్పర్థలే కారణమని అంతా చెప్పుకున్నారు. ఒక దశలో వేరే నిర్మాతలను వెతికేపనిలో శంకర్ పడినట్టుగా కూడా వార్తలు రాగా, అలాంటిదేం లేదని నిర్మాతలు కూడా క్లారిటీ ఇచ్చారు. 
 
అలాగే, తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత, తదుపరి షెడ్యూల్ షూటింగును నిలిపేశారనే టాక్ కోలీవుడ్‌లో షికారు చేస్తోంది. తొలి షెడ్యూల్‌లోనే తాము అనుకున్న పరిమితికి మించి ఖర్చు చేయించిన కారణంగా నిర్మాతలు శంకర్‌పై అసహనాన్ని వ్యక్తం చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.