మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 18 జనవరి 2018 (08:58 IST)

నేడు అన్నగారి వర్థంతి.. నెక్లెస్ రోడ్డుకు క్యూ కట్టిన హీరోలు

మాజీ ముఖ్యమంత్రి, మహా నటుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్థంతిని ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వర్థంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్దఎత్

మాజీ ముఖ్యమంత్రి, మహా నటుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్థంతిని ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వర్థంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్దఎత్తున హైదరాబాద్ నక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్‌కు తరలివచ్చి నివాళులు అర్పించారు. 
 
ముఖ్యంగా, ఎన్టీఆర్ కుమారులైన సినీ నటుడు బాలకృష్ణ, ఆయన సోదరుడు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే నేటికీ అమలు అవుతున్నాయని పెద్ద కుమారుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ అన్నారు. అటువంటి మహానుభావుడి గురించి మాట్లాడుకునేందుకు ఎన్ని యుగాలైనా చాలవన్నారు. తెలుగు భాష ఈ భూమ్మీద ఉన్నంత వరకు ఎన్టీఆర్ మన మధ్య జీవించి ఉంటారన్నారు.
 
ఆ తర్వాత హీరో బాలకృష్ణ మాట్లాడుతూ, తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్ అని, తెలుగువారి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని, తెలుగు వెలుగును ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసిన వ్యక్తని కొనియాడారు. తెలుగు ప్రజలకు సేవచేయాలన్న సంకల్పంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేసుకున్నారు.