రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ సినీ గాయకుడు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ సినీ గాయకుడు దుర్మరణం పాలయ్యారు. ఆయన పేరు నితిన్ బాలీ. బోరివలి నుంచి మలాద్ వస్తూ వేగంగా కారు నడుపుతూ రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తర్వాత ఇంటికెళ్లిన ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన బుల్లితెర నటి రోమా బాలి భర్త.
నితిన్ బాలీ వేగంగా కారు నడిపి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టినందుకు ఆయనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనకు బెయిలిచ్చి ఇంటికి పంపారు. తలకు, ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించినా వారి పెడచెవిన పెట్టాడు.
నేరుగా ఇంటికి వెళ్లిన తర్వాత కడుపునొప్పితోపాటు వాంతులు చేసుకున్నాడు. నితిన్ బాలీలి ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే గుండె పోటుతో మరణించాడు. నితిన్ బాలీ ప్రముఖ టీవీ నటి రోమాను వివాహమాడారు. నితిన్ బాలీ అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి.