ఓ ముసలోడు.. నా తొడపై గిల్లాడు : సింగర్ చిన్మయి శ్రీపాద
సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు చోటుచేసుకున్నట్టు పలువురు హీరోయిన్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దక్షిణాది నేపథ్య గాయని చిన్మయి శ్రీపాద కూడా తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులపై పెదవి విప్పింది. ట్విట్టర్ వేదికగా ఆమె తన స్పందన తెలియజేసింది.
8-9 ఏళ్ల వయస్సులో అమ్మతో కలిసి ఒక రికార్డింగ్ స్టూడియోకు వెళ్లానని, అక్కడ తను నిద్రపోతున్నప్పుడు ఎవరో తడుముతున్నట్టు గుర్తించానని, ఆ విషయాన్ని అమ్మతో కూడా చెప్పానని పేర్కొంది. అలాగే 10-11 ఏళ్ల వయస్సప్పుడు డిసెంబర్ సంగీత కచేరీ చూస్తుండగా ఒక ముసలాయన తన తొడపై గిల్లాడని వెల్లడించిందన్నారు.
ఇక తాజాగా తన అభిప్రాయాలకు మద్దుతు తెలిపే నెపంతో ఒక వ్యక్తి మాటలతోనే లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. డార్లింగ్, స్వీట్‌హార్ట్ అంటూ పిలవడంతో అతన్ని దూరంగా పెట్టానని, అయితే ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడని చిన్మయి ఆ సందేశాల్లో పేర్కొంది.