మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (08:59 IST)

ముస్లిం కుర్రోడితో డేటింగ్ చేస్తావా? సిగ్గులేదా? హిందూ యువతిని చితకబాదిన ఖాకీలు

ముస్లిం యువకుడితో డేటింగ్ చేస్తున్న ఓ హిందూ యువతిని ఓ మహిళా కానిస్టేబుల్ చితకబాదింది. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆమెను దూషించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివర

ముస్లిం యువకుడితో డేటింగ్ చేస్తున్న ఓ హిందూ యువతిని ఓ మహిళా కానిస్టేబుల్ చితకబాదింది. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆమెను దూషించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరశీలిస్తే...
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరానికి చెందిన 20 ఏళ్ల హిందూ యువతి ముస్లిం యువకుడితో డేటింగ్ చేస్తోంది. హిందూ యువతి ముస్లిం యువకుడితో కలిసి ఉండగా వీహెచ్‌పీ కార్యకర్తలు లవ్ జిహాద్ అంటూ వారిద్దరినీ పట్టుకొని పోలీసుస్టేషనుకు లాక్కెళ్లారు. దీంతో పోలీసులు హిందూ యువతిని ఆమె తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్లేందుకు వ్యాను ఎక్కించారు. హోంగార్డు సైన్ సెర్పాల్ వ్యాన్ నడుపుతూ వీడియో తీశాడు. 
 
లేడీ కానిస్టేబుల్ ప్రియాంక హిందూ యువతి స్కార్ప్ తీసి జుట్టు పట్టుకొని చితకబాదింది. ముస్లిం యువకుడితో డేటింగ్ చేయడం నీకు సిగ్గనిపించడం లేదా అంటూ హోంగార్డు సైన్ సెర్పాల్ యువతిని ప్రశ్నించాడు. హెడ్ కానిస్టేబుల్ సలేక్ చంద్, కానిస్టేబుల్ నీతు‌సింగ్‌లు కూడా యువతిని దూషించారు. ఈ ఘటనకు చెందిన వీడియోను గుర్తుతెలియని వ్యక్తి ట్విట్టర్‌లో పెట్టడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 
 
దీంతో యూపీ సర్కారు రంగంలోకి దిగి హిందూ యువతిని కొట్టి, దూషించిన నలుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనలో లేడీ కానిస్టేబుల్ ప్రియాంకతోపాటు హోంగార్డు సైన్ సెర్పాల్, హెడ్‌కానిస్టేబుల్ సలేక్‌చంద్, కానిస్టేబుల్ నీతు‌సింగ్‌లను సస్పెండ్ చేసి శాఖ పరమైన దర్యాప్తునకు ఆదేశించామని అదనపు డైరెక్టరు జనరల్ ప్రశాంత్ కుమార్ చెప్పారు.