ఉద్ధవ్ థాకరే ప్రశసంలు పొందిన మేజర్ చిత్రం
Uddhav Thackeray, Adavishesh, Kiran Thikkan, Sai Manjrekar, Mahesh Manjrekar
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథను చిత్రంగా తీసిన `మేజర్` టీమ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రశంసించారు. అడవిశేష్, దర్శకుడు కిరణ్ తిక్క, సాయి మంజ్రేకర్ ను ఆయన అభినందించారు. దేశంకోసం పోరాడిన యోధుడిగా థాకరే అభివర్ణించారు. ఇలాంటి కథలు వెండితెరపై మరిన్ని రావాలని యువతకు స్పూర్తిదాయకంగా నిలవాలని సూచించారు.
26/11 నాడు ముంబైని చీకటి సమయంలో రక్షించిన హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ యొక్క పరాక్రమం, ధైర్యాన్ని ప్రదర్శించినతీరును కూడా ఆయన చిత్ర యూనిట్‌తో చర్చించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుటుంబం కూడా పాల్గొన్నారు.