శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2022 (17:25 IST)

అన్ స్టాపబుల్- 2 ట్రైలర్ వచ్చేస్తోంది..ఎప్పుడంటే..?

NBK
NBK
నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్-2 షో నుంచి ట్రైలర్ విడుదల కానుంది. ఎంతోమంది స్టార్ హీరోలు సైతం తమ మాటలతో సరదా సంభాషణలతో బాలకృష్ణ మొదటి సీజన్‌ని చాలా ఘనవిజయంగా పూర్తి చేశారు.
 
ఇప్పటికే అన్ స్టాపబుల్ -2 సీజన్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇస్తూ వుండగా.. అటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం చివరి దశలో ఉంది. 
 
ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే అన్ స్టాపబుల్ -2 సీజన్లో పాల్గొనబోతున్నారు. ఇటీవలే ఈ టాక్ షోకి సంబంధించి ఒక సాంగ్‌ను కూడా విడుదల చేయడం జరిగింది. NBK -2 టైటిల్ సాంగ్‌ను రివీల్ చేశారు ఆహా సంస్థ.
 
దీంతో ప్రేక్షకులలో ఈ పాట బాగానే ఆకట్టుకుంది. తాజాగా అన్ స్టాపబుల్ ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా అక్టోబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్నారని వార్తని ఒక పోస్టర్ ద్వారా రివీల్ చేశారు.