అల్లు అర్జున్‌తో చిందేయనున్న ఊర్వశీ రౌటెలా!
దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ సినిమాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు పుష్ప కోసం ఓ ఐటం సాంగ్ ట్యూన్‌కు దేవీశ్రీ సిద్ధం చేశాడు. ఈ పాటకోసం పలువురు హీరోయిన్లను పరిశీలించగా బాలీవుడ్‌కు చెందిన ఊర్వశి రౌటలా ఎంపికయినట్లు సమాచారం. అల్లు అర్జున్‌తో కలిసి డాన్స్ వేయాలంటే అంతే డాన్స్‌లో నైపుణ్యం వుండాలి. ఇప్పుడు ఆయనతో డాన్స్ వేయడానికి సిద్ధమైంది ఊర్వశీ రౌటెలా. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో చేసిన ఈమె మోడల్. వర్జిన్ భానుప్రియ నుంచి హేట్ స్టోరీ వరకు సినిమాలో నటించింది. తను గొప్ప నృత్యకారిణి కూడా.
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. అయితే కరోనా కారణంగా చిత్రీకరణకు కాస్త బ్రేక్ వచ్చింది. అయితే రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమాకు ఐటం సాంగ్ పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. ఈమధ్య బాగా ట్రెండ్ అయిన జానపద బాణీలోనే ఈ పాట వుండబోతుందని సమాచారం. ఇప్పటికే ఆచార్య సినిమాలోనూ జానపద బాణీ కూడా వుంది. ఇందుకోసం పాట కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పుష్ప షూటింగ్ కు గ్యాప్ వచ్చాయి. అందుకే ప్రభుత్వం నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు.