పుష్ప రెండు భాగాల వల్ల లాభంలోనూ తగ్గెదెలే!
`పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ `తగ్గేదెలే..` అని పెట్టడానికి చాలా అర్థం వుందని ఇప్పుడు తెలుస్తోంది. కథాపరంగా విలన్ల కోసం పోరాడే క్రమంలో తగ్గెదేలే అన్నట్లుగా వుందని ట్రైలర్ చూశాక అనిపించింది. కానీ ఇది ఇప్పుడు మరోరకంగానూ కరెక్ట్‌గా సరిపోతుందని తెలిసింది. అదేమంటే, గత కొద్దిరోజులుగా పుష్ప సినిమాను రెండు భాగాలుగా చేస్తున్నారని వార్తలు వినిపించాయి. తాజాగా అలాంటి సినిమాను రెండు భాగాలుగా చేయడంలో తగ్గెదేలే అని తేల్చిచెప్పేశారు మైత్రీమూవీస్ నిర్మాతలు.
సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మొదట రెండు భాగాలు చేయాలనే ఆలోచన నిర్మాతలకు లేదట. సినిమా అంతా అయ్యాక నిడివి చూసేసరికి 4గంటల 10 నిముషాల వరకు వచ్చింది. దాన్ని రెండున్న గంటలకు కుదించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పనిగా అనిపించింది. అందుకే బాహుబలి సినిమా తరహాలో రెండు భాగాలు చేయడం బెటర్ అని సుకుమార్, అల్లు అర్జున్ చర్చల్లో నిర్మాతలకు చెప్పడంతో వారు ఓకే చేసేశారు. ఇప్పటికే మొదటి పూర్తయింది.
పుష్ప సినిమాను మొదటి భాగం అంతా రంపచోడవరం అటవీ ప్రాంతంలో చిత్రీకరించారు. ఇక రెండో భాగం తీయాలంటే సేమ్ లొకేషన్ కాకుండా విజువల్ ట్రీట్ కోసం మరో ప్లేస్‌లో తీయాలని అవసరమైతే కొంత భాగం గ్రాఫిక్స్ వినియోగించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటం సాంగ్‌ను కూడా చేశారు. రెండో భాగంగా విడదీస్తే 20శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఇంకా మిగిలిన భాగం తీయాలి. అయితే ఇందులో లాభపడేది ఎవరు? అంటే.. బోనస్‌గా అల్లు అర్జున్‌కు 10 కోట్లు, దర్శకుడు సుకుమార్‌కు 5 కోట్లు దక్కుతాయని విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత సంగీత దర్శకుడు, కెమెరామెన్‌కు 25శాతం దక్కనుంది.
మిగిలిన నటీనటులు టెక్నీషియన్లకు మామూలు షూటింగ్ జరిగే రోజుల్లో వేతనం దక్కుతుంది. ఇక ఈ సినిమాను మైత్రీమూవీస్ సంస్థాగతమైన బయ్యర్లు ఎలాగూ వున్నారు. వారికే అమ్మేస్తున్నారు. రెండు భాగాలు కలిపి తీసుకుంటే ఒక రేటు, విడివిగిగా తీసుకుంటే వేరు వేరు రేట్లకు అమ్మనున్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మరి బాహుబలికి వర్కవుట్ అయినవిధంగా పుష్పకు ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాల్సిందే.