నా గుడిని వాటికోసం వాడండి: నిధి అగర్వాల్
తమిళ సినిమా అభిమానులు నచ్చిన వారికి విగ్రహం కట్టడం, అభిషేకాలు చేయడం పరిపాటే. ఖుష్బూ, నమిత, హన్సిక తర్వాత తాజాగా నిధి అగర్వాల్‌కు తమిళ అభిమానులు ఇటీవలే గుడి కట్టిన విషయం తెలిసిందే. దీనిపై గురువారంనాడు ఆమె స్పందించింది. ఇటీవల కొంతమంది అభిమానులు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు గుడి కట్టి, ఆమె విగ్రహం పెట్టి పాలాభిషేకం జరిపారు. అయితే ఆమె తమిళంలో నటించిన సినిమాలు కేవలం రెండే.
అందులో ఒకటి భూమి ఓటీటీలో విడుదల కాగా, రెండో సినిమా ఈశ్వరన్ పొంగల్ కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఈ రెండు సినిమాలకే నిధి అగర్వాల్‌పై తమిళలు బాగా ఇష్టం పెంచుకున్నారు. ఆమెను గుండెల్లో పెట్టుకోవడంతో పాటు గుడి కట్టి ఆరాధిస్తున్నారు. దీనిపై పలువురు ఆమెను అడిగితే, ఇలా స్పందించింది.
అభిమానులు తనను ఆదరించడం ఆనందం కలిగించేదే. ఇక పైన ఆ ఆలయ నిర్వాహకులు ఆ గుడిని నిర్వాశ్రితుల కోసం, చదువు కోసం, నీడ కోసం ఉపయోగించాలంటూ కోరుతూ నిధి అగర్వాల్ బాధ్యులకు లిఖితపూర్వకంగా రాసిన స్టేట్‌మెంట్ విడుదల చేసింది.