శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 మే 2023 (07:22 IST)

పీటర్ పాల్ నా భర్త కాదు.. నేను ఆయనకు భార్యను కాదు.. జస్ట్ రిలేషన్‌లో ఉన్నా.. నటి వనతి

vanitha
పీటర్ పాల్ తన భర్త కాదనీ, నేను ఆయన భార్యను కాదని తామిద్దరం కొంతకాలం రిలేషన్‌లో ఉన్నామని తమిళ నటి వనిత విజయకుమార్ వివరణ ఇచ్చారు. వనిత విజయకుమార్ మూడో భర్త చనిపోయారంటూ మీడియా ప్రచారం చేయొద్దని ఆమె కోరారు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన పీటర్ పాల్ ఇటీవల మృతి చెందిన విషయం తెల్సిందే. దీంతో వనిత మూడో భర్త చనిపోయారంటూ వార్తా కథనాలు వచ్చాయి. వీటిపై వనిత తాజాగా వివరణ ఇచ్చారు.
 
'పీటర్ పాల్ మృతి ఘటనపై స్పందించాలా? వద్దా? అన్న సందిగ్ధంతో చాలా ఓపిక పట్టాను. నాకు అవకాశం లేకుండా చేశారు. అన్ని మీడియా సంస్థలు, న్యూస్‌ ఛానళ్ల మీద ఉన్న గౌరవంతో ఒక విషయం గుర్తు చేస్తున్నా. పీటర్‌పాల్‌తో నాకు న్యాయబద్ధంగా వివాహం జరగలేదు. 2020లో కొన్ని రోజుల పాటు ఆయనతో రిలేషన్‌షిప్‌లో ఉన్నా. అది ఆ సంవత్సరమే ముగిసింది.
vanitha peter paul
 
నేను ఆయన భార్యను కాదు. ఆయన నా భర్తా కాదు. 'వనిత విజయ్‌కుమార్‌ భర్త చనిపోయాడు' అంటూ రాస్తున్న వార్తలను ఆపేయండి. నాకు భర్తలేడు. ఒంటరిగానే ఉంటున్నా. ఏ విషయానికి నేను బాధపడటం లేదు. నేను చాలా సంతోషంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నా. మీ అందరికీ ఇదే నా విన్నపం. మిస్‌-వనిత విజయ్‌కుమార్‌' అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వనిత పోస్టు పెట్టారు.