గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (17:18 IST)

బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు మైఖేల్ జోర్డాన్ బూట్లు వేలం- రూ.18 కోట్లు పలికింది..

Shoes
Shoes
ప్రముఖ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు మైఖేల్ జోర్డాన్ మ్యాచ్‍‌ల సందర్భంగా ధరించిన 'బ్రెడ్' ఎయిర్ జోర్డాన్ 13ఎస్ బూట్ల జత వేలానికి రానుంది. 1998 N.P.A. టోర్నమెంట్ ఫైనల్స్‌లో జోర్డాన్ ఈ షూలను ధరించాడు. జోర్డాన్‌కు చెందిన చికాగో బుల్స్ టోర్నీని గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.
 
ఈ సందర్భంలో, బూట్లు వేలం వేయబడి 2.2 మిలియన్ డాలర్లకు (భారతీయ విలువలో సుమారు 18 కోట్ల రూపాయలు) అమ్ముడయ్యాయి. జోర్డాన్ ఆటలో ధరించే బూట్లు, జెర్సీలకు ఊహించిన దానికంటే ఎక్కువ డిమాండ్ ఉందని వేలం హౌస్ హెడ్ చెప్పారు