శనివారం, 4 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (21:46 IST)

02-04-2023 నుంచి 08-04-2023 వరకు మీ వార రాశిఫలాలు (video)

Weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ఆర్థికస్థితి సామాన్యం. నిస్తేజానికి లోనవుతారు. అవకాశాలు చేజారిపోతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనుల్లో అవాంతరాలు, చికాకులు ఎదుర్కుంటారు. ఆశావహదృక్పథంతో మెలగండి. పరిస్థితులు త్వరలో సర్దుకుంటాయి. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. బుధవారం దంపతుల మధ్య సఖ్యత లోపం. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థల మార్పు కలిసివస్తుంది. ఉపాధ్యాయులకు స్థానచలనం. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. మీపై శకునాల ప్రభావం అధికం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. గురువారం దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. పాతమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు అదనపు బాధ్యతలు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త.
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుంటారు. మీ కష్టం వృధా కాదు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం క్షేమం కాదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. ఆదివారం విలువైన వస్తువులు జాగ్రత్త. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
సంకల్పం నెరవేరుతుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం. ఆడంబరాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సోమ, మంగళవారాల్లో చేసిన పనులే చేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. వృత్తుల వారికి సామాన్యం. వాహనదారులకు దూకుడు తగదు. ప్రేమ వ్యవహారాలు సమస్యాత్మకమవుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. శనివారం పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. చేతివృత్తులు, కార్మికులకు పనులు లభిస్తాయి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఖర్చులు విపరీతం. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆదివారం ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆశావహదృక్పథంతో మెలగండి. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కీలక పత్రాలు అందుతాయి. స్థిరచరాస్తుల విక్రయంలో మెలకువ వహించండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఏజెంట్లు, చిట్స్ రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఈ వారం వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. మీ కష్టం వృధా కాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఖర్చులు అధికం. ఆడంబరాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో జాగ్రత్త. మీ శ్రీమతి సలహా పాటించండి. ఉల్లాసంగా గడుపుతారు. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించాలి. గృహమార్పు అనివార్యం. ఉమ్మడి వ్యాపారాలపై దృష్టి పెడతారు. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. మీ ప్రమేయంతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. అధికారులకు ధనప్రలోభం తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు మెరుగుపడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. అవకాశాలను వదులుకోవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. కొంతమంది మీ యత్నాలకు అడ్డుతగిలే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఆర్థికంగా బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. మంగళవారం నాడు అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. పత్రాల మార్పు చేర్పుల్లో మెలకువ వహించండి. పెట్టుబడులకు అనుకూలం. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
వ్యవహారాలు అనుకూలిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. గురువారం అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. ఇదీ ఒకందుకు మంచిదే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సంస్థల స్థాపనకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. మీ కష్టం వృధా కాదు. వ్యతిరేకులు మీ సమర్ధతను గుర్తిస్తారు. ధనలాభం ఉంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. సంతానం ధోరణి చికాకుపరుస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. అనునయంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆదివారం ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. నూతన వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. శనివారం పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. వాదోపవాదాలకు దిగవద్దు. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. స్థిరచరాస్తుల వ్యవహారంలో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. పత్రాలు అందుకుంటారు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. వృత్తుల వారికి సామాన్యం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు.