శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (13:47 IST)

బాలీవుడ్ అరంగేట్రానికి ముందే బ్రాండ్ అంబాసిడర్‌గా సుహానా ఖాన్

Suhana Khan
Suhana Khan
షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ బాలీవుడ్ అరంగేట్రానికి ముందే బ్రాండ్ అంబాసిడర్‌గా అవతారం ఎత్తింది. షారూఖ్ ఖాన్-గౌరీ ఖాన్ కుమార్తె, సుహానా ఖాన్ న్యూయార్క్ ఆధారిత బ్యూటీ బ్రాండ్ మేబెల్‌లైన్‌కి అంబాసిడర్‌గా మారింది. సోమవారం, ముంబైలో సుహానా తొలి మీడియా ఈవెంట్ తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడింది. 
Suhana Khan
Suhana Khan
 
చిత్రనిర్మాత జోయా అక్తర్ తదుపరి ది ఆర్చీస్‌తో సుహానా ఖాన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. తాజాగా బ్రాండ్ అంబాసిడర్ ఈవెంట్ కోసం, పవర్‌సూట్‌లో ఆల్-రెడ్ లుక్‌ని సుహానా ఎంచుకుంది. ఈ ఈవెంట్‌కి సంబంధించిన అనేక చిత్రాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. 
Maybelline Event
Maybelline Event
 
ఈ సందర్భంగా సుహానా మీడియాతో మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. బ్రాండ్ అంబాసిడర్‌గా మారినందుకు హ్యాపీగా వుంది. మేబెల్‌లైన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. వారి అనేక ఐకానిక్ ఉత్పత్తులను ప్రచారం చేస్తాను." అంటూ తెలిపింది.  
Maybelline Event
Maybelline Event