శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (18:31 IST)

లవ్ బ్రేకప్.. రోడ్డుపైకి వచ్చి కారుపైకెక్కి రభస చేసిన మహిళ

Car_women
Car_women
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో, ఒక మహిళ తన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఫుటేజ్‌లో, ఆ మహిళ తన ప్రియుడితో విడిపోయిన తర్వాత, రద్దీగా ఉండే జంక్షన్‌లో కారు బానెట్ పైన కూర్చోవడం కనిపిస్తుంది. 
 
ఇది రోజూ చూసే దృశ్యం కాదనే చెప్పాలి. విడిపోవడానికి వ్యక్తులు వింతగా స్పందించిన సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ, ఈ తాజా కేసులో ఓ మహిళ తన ప్రియుడితో బ్రేకప్ తర్వాత రోడ్డుపైకి వచ్చి నానా రభస చేసింది. 
 
ఈ వీడియోలో, మహిళ కారుపై ఎక్కి నిల్చుని ట్రాఫిక్‌ను స్తంభింపజేసింది. ఆపై స్థానికులు జోక్యం చేసుకుని ఆమెను కిందికి దించారు. ఈ క్రమంలో టాటా ఇండికా బానెట్‌పైకి ఎక్కి, రోడ్డు మధ్యలో ట్రాఫిక్‌ను అడ్డుకుంటుంది. ఈ వీడియోపై పలువురు స్పందిస్తున్నారు.