గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (18:27 IST)

''నాగకన్య''గా వస్తోన్న వరలక్ష్మి శరత్ కుమార్..

వరలక్ష్మి శరత్ కుమార్, రాయ్ లక్ష్మి, కేథరిన్ ప్రధాన పాత్రల్లో నాగకన్య అనే సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. నాగకన్య కథా నేపథ్యంలో రూపొందే ఈ సినిమా తమిళంలో ''నీయా'' అనే టైటిల్‌తో రానుంది.


ఇందులో ముగ్గురు హీరోయిన్లతో పాటు జై కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. సురేశ్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. ఇందులో నాగకన్యగా వరలక్ష్మి శరత్ కుమార్ ఎరుపు రంగు దుస్తులతో ఆకట్టుకునేలా వుంది. త్వరలోనే ఈ సినిమా ఆడియో విడుదల కానుంది. 
 
ఈ చిత్రం 1979లో తమిళంలో కమల్ హాసన్, శ్రీప్రియ జంటగా నటించిన ''నీయా'' తరహాలో నాగులకు సంబంధించిన కథతో తెరకెక్కుతోందని దర్శకుడు సుందర్ తెలిపారు. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని.. చెన్నై, మదురై, చల్లకుడి, కేరళ వంటి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగిందన్నారు. లవ్ అండ్ థ్రిల్లర్‌గా నాగకన్య ప్రేక్షకుల ముందుకు వస్తుందని సురేష్ చెప్పుకొచ్చారు.