గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 1 జనవరి 2019 (16:51 IST)

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి సూపర్ పోస్టర్..

కొత్త సంవత్సరం కానుకగా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. ఈ సినిమాలో బసవతారకం పాత్రలో నటిస్తున్న విద్యాబాలన్ పుట్టిన రోజు కావడంతో సినీ యూనిట్ సినిమాకు సంబంధించిన ఆసక్తి కరమైన పోస్టర్‌‌ను విడుదల చేశారు. 
 
ఈ పోస్టర్లో ఎన్టీఆర్ (బాలకృష్ణ) తన సతీమణి బసవతారకం (విద్యాబాలన్)తో కలిసి మనవడికి నామకరణం చేస్తున్నట్లు కనిపించారు. ఈ పోస్టర్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. 
 
అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం యన్‌టిఆర్‌. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.