శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 30 డిశెంబరు 2018 (12:00 IST)

అల్లూరి సీతారామ రాజుగా బాలయ్య... లుక్ అదిరింది..

ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలకృష్ణ కూడా అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా అల్లూరి పాత్రకి సంబంధించిన బాలయ్య పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ నెటిజన్లు ఆకట్టుకుంటోంది. బ్రిటీష్ వారిని తరిమికొట్టి స్వాతంత్ర్యం అందించిన మహాపురుషుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. ఆ వీరుడి నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు సినిమా తెరకెక్కింది. 
 
ఇందులో సూపర్ స్టార్ కృష్ణ అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందారు. తాజాగా అల్లూరి పాత్రలో బాలయ్య నటిస్తున్నారు. ఎన్టీఆర్ చిత్రం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత నేపథ్యంలో తెరకెక్కుతుంది. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా విడుదల కానుంది. జనవరి 9న కథానాయకుడు పేరుతో చిత్రాన్ని విడుదల చేస్తుండగా, ఫిబ్రవరి 7న మహానాయకుడు రిలీజ్ కానుంది.