కొత్త సంవత్సరం ప్రసంగంలో కిమ్ జాంగ్ వార్నింగ్
కొత్త సంవత్సరం ప్రసంగంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్.. అమెరికా వార్నింగ్ ఇచ్చారు. తమపై వున్న ఆంక్షలను కొనసాగించినట్లైతే.. మరోదారి చూసుకోవాల్సిన అవసరం వుంటుందని కిమ్ జాంగ్ తెలిపారు. అంతర్జాతీయ సమాజం ముందు ఇచ్చిన హామీలను అమెరికా గుర్తించుకోవాలని కోరారు. ప్రపంచానికి మేలు కలిగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాను ఏ క్షణమైనా సిద్ధమేనని చెప్పారు.
తమ సహనాన్ని పరీక్షించవద్దని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా తమపై ఒత్తిడిని కలిగించవద్దని కిమ్ జాంగ్ వెల్లడించారు. అమెరికాతో కలసి సంయుక్త మిలటరీ డ్రిల్స్‌ను నిర్వహించవద్దని ఈ సందర్భంగా దక్షిణకొరియాను కిమ్ కోరారు.
కొరియా ద్వీపకల్పంలో సుస్థిరమైన శాంతిని నెలకొల్పేందుకు ఉత్తర, దక్షిణ కొరియాలు పలు కోణాల్లో చర్చలు జరపాలని పిలుపునిచ్చారు.