చెన్నై మెరీనా బీచ్‌లో ధోనీ, జీవా ఇలా చేశారు.. (వీడియో)

Last Updated: సోమవారం, 31 డిశెంబరు 2018 (11:20 IST)
మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే ఐపీఎల్ పోటీల్లో ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను మేనేజ్‌మెంట్‌తో ఏర్పాట్లు, ఆటగాళ్లకు శిక్షణ తదితర అంశాలపై చర్చించేందుకే ధోనీ చెన్నైకి వచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో ధోనీ తాజా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆదివారం చెన్నైకి తన కుటుంబంతో వచ్చిన ధోనీ.. కుమార్తె జీవాతో కలిసి మెరీనా బీచ్‌కి వెళ్లాడు. అక్కడ ఇసుకలో గూళ్లు కట్టాడు. గుంతతీసి.. తన కుమార్తెను అందులోకి దింపాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
కాగా ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. మరో పది రోజుల్లో వన్డేలు, ట్వంటీ-20ల్లో ఆడేందుకు ధోనీ వెళ్లనున్నాడు. ప్రస్తుతం చెన్నై బీచ్‌లో జీవాతో కలిసి ధోనీ ఆడుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.దీనిపై మరింత చదవండి :