శనివారం, 25 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 డిశెంబరు 2018 (11:51 IST)

నాకు ఇల్లు లేదు.. బస్సులోనే నివసిస్తున్నా.. ధోనీ

''నాకు ఇల్లు లేదు.. బస్సులోనే నివసిస్తున్నా..'' అని మాజీ కెప్టెన్ ధోనీ... ఓ చిన్నారితో మాట్లాడిన క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చిన్నారితో ధోనీ.. క్యూట్‌గా మాట్లాడే ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదలైన ఈ వీడియో విడుదలైన గంటల్లోనే భారీ వ్యూస్ సంపాదించుకుంది. టీ-20, వన్డేల్లో ఆడని ధోనీ.. తన సొంతూరైన రాంచీలో హ్యాపీగా గడుపుతున్నాడు. 
 
ఇంకా తన కుమార్తె జీవాతో కలిసి గడిపిన సందర్భాలను వీడియో రూపంలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదేవిధంగా ధోనీ ఓ చిన్నారితో బుజ్జగించి మాట్లాడే వీడియో వైరల్ అవుతోంది. ఇందులో తనకు ఇల్లు లేదని.. తాను బస్సులోనే నివాసం వుంటున్నానని ధోనీ చెప్పగా, అందుకు ఆ చిన్నారి.. సరే.. ఇల్లు ఎక్కడుందని అడుగుతోంది. అందుకు ధోనీ నవ్వుతూ.. తన ఇల్లు చాలా దూరంలో వుందని చెప్తున్నాడు.