సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2024 (10:48 IST)

ఓటీటీలో ఒక్క రోజులోనే 1.4 మిలియన్‌ తో ఆదరణతో వరుణ్‌సందేశ్‌ నింద

Ninda poster
Ninda poster
థియేటర్‌లో సందడి చేసిన సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఎప్పుడా అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. అలా ఎదురుచూసే సినిమాల్లో ఒకటి వరుణ్‌ సందేశ్‌ తాజా చిత్రం 'నింద'. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం 'నింద'. ఈ చిత్రంలో వరుణ్  సందేశ్‌ నటన హైలైట్‌గా నిలిచింది. థియేటర్‌లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి విజయాన్నే సాధించిన ఈ చిత్రం ఈ నెల 6నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఓటీటీలో కూడా ఈ చిత్రానికి మంచి అనూహ్య స్పందన వస్తోంది. కేవలం ఒక్క రోజులోనే 1.4 మిలియన్‌  స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో నింద చిత్రం టాక్‌ ఆఫ్‌ ద ఓటీటీగా మారింది. ఈ క్రమంలో చూస్తుంటే నింద ఓటీటీలో మరింత వేగంగా దూసుకెళ్లే అవకాశం వుందని కూడా అంటున్నారు అందరూ. 
 
ఇక వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వచ్చిన నింద చిత్రం వరుణ్ సందేశ్‌ నటనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వుండే ఈ చిత్రం ఓటీటీలో మరింత మంది ప్రశంసలు అందుకుంటుందనే నమ్మకం వుందని నిర్మాత తెలిపారు.
 
అన్నీ, శ్రేయ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఇతర ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రానికి రమీజ్ నవీత్ కెమెరా, సంతు ఓంకార్ సంగీతం అందించారు. అనిల్ కుమార్ ఎడిటింగ్ చేశారు.