మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2019 (15:33 IST)

వెంకీమామ క్రిస్మ‌స్‌కి వ‌స్తాడో...? స‌ంక్రాంతికి వ‌స్తాడో..?

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీమామ‌. జైల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. 
 
సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ క‌లిసి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రానుంది అని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి కానీ.. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. అస‌లు ఇంకా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇందులో గ్రాఫిక్స్ వ‌ర్క్ ఉంద‌ట‌. ఆ వ‌ర్క్ కూడా కంప్లీట్ అయ్యింద‌ట‌. 
 
కాక‌పోతే ఆ వ‌ర్క్ సురేష్ బాబుకి న‌చ్చ‌క మ‌ళ్లీ ఆ వ‌ర్క్ ని చేయిస్తున్నార‌ట‌. ఒక‌ట్రెండు రోజుల్లో గ్రాఫిక్స్ వ‌ర్క్ పూర్త‌వుతుంద‌ట‌. అప్పుడు లేటెస్ట్ గా చేసిన గ్రాఫిక్స్ వ‌ర్క్ చూసిన త‌ర్వాత బాగా వ‌చ్చింది అనుకుంటే.. వెంట‌నే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తార‌ట‌.
 
డిసెంబ‌ర్ 13న వెంకీ పుట్ట‌నిరోజు సంద‌ర్భంగా రిలీజ్ చేస్తార‌ని కొంత మంది అంటుంటే... కాదు సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న రిలీజ్ అని కొంత మంది అంటున్నారు. మ‌రి... వెంకీమామ క్రిస్మ‌స్‌కి వ‌స్తాడో...? స‌ంక్రాంతికి వ‌స్తాడో..? చూడాలి.