శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 7 అక్టోబరు 2019 (22:34 IST)

రంగంలోకి దిగిన వెంకీమామ... టెన్ష‌న్ ప‌డుతున్న యువ హీరోలు..?

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ‌. దీనికి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్... మ‌రో నిర్మాణ సంస్థ  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీతో క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇందులో రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్ న‌టిస్తున్నారు. 
 
ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాని ద‌స‌రాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే... సైరా రిలీజ్ ఉండ‌డం... అలాగే ఈ సినిమాకి సంబంధించి షూట్ కూడా ఆల‌స్యం అవ్వ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల‌న ద‌స‌రాకి రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఈ సినిమాని డిసెంబ‌ర్ నెలలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. 
 
రిలీజ్ విష‌యంలో క్లారిటీ రావ‌డంతో మ‌ళ్లీ ప్ర‌మోష‌న్ షురూ చేసారు. ద‌స‌రా సంద‌ర్భంగా రేపు ఉద‌యం 8.08 నిమిషాల‌కు ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తున్నారు.
 
 ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అయితే... డిసెంబ‌ర్‌లో నితిన్ భీష్మ‌, ర‌వితేజ డిస్కోరాజా, శ‌ర్వానంద్ 96 త‌దిత‌ర చిత్రాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. ఇప్పుడు వెంకీమామ కూడా డిసెంబ‌ర్ లో వ‌స్తుండ‌డంతో యువ హీరోలు టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. మ‌రి.. డిసెంబ‌ర్‌లో వెంకీ మామ ఎప్పుడు వ‌చ్చేది త్వ‌ర‌లోనే అఫిషిల‌య్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం.