గురువారం, 23 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: మంగళవారం, 24 జనవరి 2023 (15:57 IST)

వెయ్ దరువెయ్ సాంగ్ ఇంటరెస్టింగ్ గా ఉంది : నాగ చైతన్య

Naga Chaitanya, Sai Ram Shankar and others
Naga Chaitanya, Sai Ram Shankar and others
హీరో సాయి రామ్ శంకర్ , హీరోయిన్ యాశ శివ కుమార్, సునీల్, కాశి విశ్వనాథ్, పోసాని కృష్ణ మురళి, పృథ్వి తదితరులు నటించిన సినిమా వెయ్ దరువెయ్. దేవరాజు పొత్తూరు నిర్మిస్తున్న చిత్రానికి నవీన్ రెడ్డి దర్శకుడు. ఈరోజు  ఈ చిత్రం నుంచి "టైటిల్ సాంగ్ వెయ్ దరువెయ్  "లిరికల్ సాంగ్ "హీరో నాగ చైతన్య రిలీజ్ చేసారు,
 
నాగ చైతన్య మాట్లాడుతూ ఈ పాట చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది, సినిమా చూడాలి అని కూతుహలాన్ని రేపుతుంది. ఈ సినిమా తెలుగులో సక్సెస్ అవ్వాలని, టీం కు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.
 
హీరో సాయి రామ్ శంకర్ గారు మాట్లాడుతూ,  నాగచైతన్య  గారి  చేతుల మీదుగా రిలీజ్ చేయటం చాల ఆనందంగా ఉంది. మా సినిమా నుంచి ఇది రెండవ సాంగ్.  మొదటి సాంగ్ మంజుల మంజుల సాంగ్ అయిదు మిల్లియన్ వ్యూస్ కి రీచ్ అయింది.  చాల మంచి విశేష స్పందన వచ్చింది.  రెండవ సాంగ్ టైటిల్ సాంగ్ ఇది మా మూవీ నుంచి మా సినిమాకి బెస్ట్ డాన్స్ నెంబర్ సాంగ్.  మీకు తప్పకుండా నచ్చుతుంది అని అన్నారు.
 
దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ,  ఈ సినిమా కథ చెప్పగానే  సింగిల్ సిట్టింగ్ లో ఒప్పుకున్నారు మా హీరో సాయి గారు , ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని జయించాను అనే అనుకుంటున్నాను " అని అన్నారు. నా నా మీద నమ్మకం తో  ఈ అవకాశాన్ని  ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి కూడా థాంక్స్ చెప్తున్నాను.
 
ప్రొడ్యూసర్ దేవరాజ్ గారు మాట్లాడుతూ " నవీన్ గారు నాకు కథ చెప్పగానే ఎంతో నచ్చింది, ఎంత ఖర్చు అయిన సరే నేను పెడతాను అని కథ మీద నమ్మకం తో ముందుకు వచ్చాను. మేము అనుకున్నట్టే చాలా బాగా వచ్చింది సినిమా  హీరో గారి కెరీర్ లో మరొక మంచి సినిమా అవుతుంది అని మేమంతా గట్టిగా నమ్ముతున్నాం" అని అన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 24th రిలీజ్ అవుతుంది.  ప్రస్తుతం పోస్ట్  ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అన్నారు.