ఆదివారం, 3 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (09:13 IST)

బోటు ప్రమాదంలో గాయపడిన విజయ్ ఆంటోనీ...

vijay antony
మల్టీటాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ ఆంటోనీ గాయపడ్డారు. ఆయన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో "బిచ్చగాడు-2" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోనీ గాయపడినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఈ చిత్రం షూటింగులో భాగంగా, సోమవారం చిత్ర యూనిట్ బోటులో ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, ఈ క్రమంలోనే బోటు అదుపు తప్పి నేరుగా కెమెరా అమర్చివున్న బోటులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయ్ ఆంటోనీ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. దీంతో ఆయనను కౌలాలంపూర్‍లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, విజయ్ ఆంటోనీకి ఎలాంటి ప్రాణాపాయం లేదని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. 
 
కాగా గత 2016లో వచ్చిన "బిచ్చగాడు" చిత్రానికి ఇపుడు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఆయన స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, ఇతర బ్యానర్లలో కూడా హీరోగా నటిస్తున్నారు. అదేవిధంగా ఆయన సొంతంగా విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌పై కూడా చిత్రాలు నిర్మిస్తున్నారు.