1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 జనవరి 2023 (13:16 IST)

టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపై అడ్డం తిరిగిన బస్సు.. ఢీకొట్టిన మరో బస్సు...

road accident
కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు టైరు పంక్చర్ కావడంతో రోడ్డుకు అడ్డంగా తిరిగింది. సరిగ్గా అదేసమయంలో వేగంగా వస్తున్న మరో బస్సు.. రోడ్డుపై అడ్డం తిరిగిన బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది దాకా గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం సెనెగల్‌లో జరిగింది. 
 
ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జరిగిందని సెనెగల్ అధ్యక్షుడు మాకే సాల్ వెల్లడించారు. గ్నిబీలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 40 మంది చనిపోగా, అనేక మంది తీవ్ర గాయాలయ్యాయని ఆయన ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నానని చెప్పారు. మృతి పట్ల సోమవారం నుంచి మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. రోడ్డు భద్రతా చర్యలపై చర్చించేందుకు అంతర్ మంత్రిత్వ మండలిని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 
 
అలాగే, ఈ ప్రమాదంపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీక్ డియోంగ్ మాట్లాడుతూ, ప్రభుత్వ బస్సు టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపై బస్సు అడ్డం తిరిగిందని, ఆ సమయంలో ఎదురుగా వస్తున్న మరో బస్సు ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనలో 78 మందికి గాయాలయ్యాని తెలిపారు.