ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (20:24 IST)

కేరళలోని టీ ఎస్టేట్‌ల గుండా ఏరోబిక్ పరుగును ఆనందిస్తున్న విజయ్ దేవరకొండ

Vijaydevarakonda at kerala
Vijaydevarakonda at kerala
విజయ్ దేవరకొండ తన 12వ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. గౌతం తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డిఫరెంట్ గెటప్ లో ఇటీవలే లుక్ విడుదలైంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ శ్రీలంకలో చిత్రీకరించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ కేరళలో జరుగుతోంది. షూటింగ్ కు ముందు విజయ్ దేవరకొండ ఇలా జాకింగ్ చేస్తూ వీడియోను విడుదలచేశారు. 
 
Vijay kerala fans
Vijay kerala fans
కేరళలోని సుందరమైన టీ ఎస్టేట్‌ల గుండా ఏరోబిక్ పరుగును ఆనందిస్తున్నానని విజయ్ ప్రకటించారు. అక్కడ సుందరమైన ప్రదేశాలను, ఎత్తైన శిఖరంలో వుండి లోయలో వున్న సరస్సులను వీక్షిస్తూ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ అభిమానులకు కూడా కనువిందుచేశారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50శాతం పైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. వచ్చే ఏడాది మార్చి 28న సినిమాను విడుదలచేయనున్నారు.