గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2024 (20:07 IST)

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

Siva, ntr, anirudh
Siva, ntr, anirudh
కొరటాల తనకు మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి, మా కష్టసుఖాలను పంచుకునేవాళ్ళం అని ఎన్.టి.ఆర్. అన్నారు. దేవర సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రీరిలీజ్ ఫంక్షన్ చేయాలని ట్రైచేసిన అభిమానుల వెల్లువ వల్ల హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఫెయిల్ అయింది. ఆ తర్వాత సక్సెస్ మీట్ అయినా గుంటూరులో చేద్దామని ప్రయ్నతించారు. కానీ దేవీనవరాత్రుల వల్ల భక్తుల రద్దీ వల్ల ఇలాంటి ఫంక్షన్ కు పర్మిషన్ ఇవ్వలేమని పోలీసు యంత్రాంగం తేల్చిచెప్పింది. 
 
దాంతో గత రాత్రి హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో దేవర సినిమాకు పనిచేసిన యూనిట్ సభ్యులు, చిత్ర ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్. మాట్లాడుతూ, జనతా గేరేజ్ నుంచి కొరటాల శివతో బాగా కనెక్టెవిటి పెరిగింది. కుటుంబసభ్యుడిలా మారిపోయారు. మా కుటుంబంలోని కష్టసుఖాలను పంచుకొనేవారం. ఆయన ఫేస్ లో సంతోషం, మనశ్శాంతి దేవర సక్సెస్ లో చూస్తున్నాను. అనుకున్నట్లు సినిమా తీశాడు. భయం అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడే చేద్దామని అనిపించింది. చేశాం. అనిరుధ్ సంగీతం సమకూర్చే క్రమంలో కొన్ని సందర్భాలలో చాలా టెన్షన్ పడ్డాడు శివ. ఆ తర్వాత తను ఇచ్చిన ఆర్.ఆర్. కు మంచి వర్కవుట్ కావడంతో ఊపిరిపీల్చుకున్నారు.
 
ఇక నాన్న తర్వాత నాన్న కళ్యాణ్ రామ్ ఆయన వున్నాడనే ధైర్యంతో నేను ముందుకు సాగుతున్నాను అన్నారు. ఈ సందర్భంగా దేవర కు పనిచేసిన టీమ్ కు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.