దేవర కలెక్లన్ల కోసం దావుడి పాటను యాడ్ చేశారు
ఎన్.టి.ఆర్. నటించిన దేవర సినిమా రోజురోజుకూ కలెక్లన్ల వేట గురించి చిత్ర నిర్మాత సంస్థ అప్ డేట్ చేస్తూనే వుంది. తాజాగా 405 కోట్ల గ్రాస్ కు చేరిందని తెలియజేసింది. అతని వేట క్రూరమైనది. మరియు ఫలితాలు చారిత్రాత్మకమైనవి, దేవర మారణహోమాన్ని అధిగమించింది, అన్ని తీరాల వద్ద విధ్వంసం సృష్టిస్తుంది. బ్లాక్ బస్టర్ దేవర అంటూ పోస్టర్ ను విడుదలచేసింది చిత్ర టీమ్.
దానితోపాటు కిలి కిలియే మూడ్ లోకి రావాలని ఎదురుచూస్తున్న అభిమానులందరికీ ఇప్పుడు దావుడి.. సాంగ్ ను మీ సమీప సినిమా థియేటర్లలో దేవరను ఆస్వాదించండి అంటూ ప్రకటించింది. దేవర సినిమాలో జాన్వీకపూర్ తో ఒక్కపాట మినహా అంతా యాక్షన్ ఎపిసోడే వుంది. రెండో పాట వుందని ప్రచారం చేశారు. కానీ విడుదల తర్వాత థియేటర్లలో లేదు. ఇప్పుడు ఏమనుకున్నారో ఏమో కానీ పాటను జోడించినట్లు చెబుతూ మరోసారి దేవరను చూడమని చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడులయి ఏడురోజులయింది.