వైవాహిక అత్యాచారాన్ని నేరం కాదు.. అలాగని మహిళా స్వేచ్ఛ కాపాడుతాం.. కేంద్రం
వైవాహిక అత్యాచార కేసులకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
వీటిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ.. మైనర్ కాని భార్యను లైంగికంగా బలవంతం చేస్తే అత్యాచారానికి పరిగణించలేమని కేంద్రం పేర్కొంది. ఒకవేళ అలా చేస్తే దాంపత్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. వివాహ వ్యవస్థలోనూ తీవ్ర అవాంతరాలకు దారితీస్తుందని వెల్లడించింది.
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే అంశం సుప్రీం కోర్టు పరిధిలోకి రాదని.. అన్ని రాష్ట్రాలు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా దీనిపై నిర్ణయం తీసుకోలేమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
వివాహం చేసుకుంటే మహిళ సమ్మతి తొలగినట్లు కాదని.. దాని ఉల్లంఘిస్తే తగిన శిక్షలు వున్నాయని కేంద్రం ప్రకటించింది. మహిళా స్వేచ్ఛ, గౌరవం, హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.