గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (15:13 IST)

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌.. డబ్బుల్లేక ఇబ్బందుల్లో నటుడు పొన్నంబళం

Ponnambalam
తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో వివిధ పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్న నటుడు పొన్నంబళం. అయితే కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ప్రమాదం నుండి బయటపడాలంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారన్నాడు.

తన సహోదరి కొడుకు కిడ్నీ దానం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసాడు. అయితే ఎలాంటి ఆదాయం లేకపోవడంతో తన కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా లేక కూమిలిపోతోందని ఓ ప్రకటనలో తెలియజేశాడు.
 
రజనీకాంత్, కమల్‌ హాసన్, రాధిక శరత్ కుమార్, ధాను ధనుష్, కె ఎస్‌ రవికుమార్, రాఘవ లారెన్స్‌, ఐసరి గణేష్‌ వంటి ప్రముఖులు ఇప్పటికే పొన్నంబళంకు ఆర్ధిక సాయం చేశారు. ప్రస్తుతం కిడ్నీ మార్పిడి కోసం దాతలు, దక్షిణ భారత నటీనటుల సంఘం, తెలుగు మా అసోసియేషన్‌ తరపున తగిన ఆర్ధిక సాయం అందించాలని నటుడు పొన్నంబళం వేడుకొన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.