ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 22 జనవరి 2018 (12:49 IST)

నవీన్‌ను పెళ్లాడిన భావన: శుభాకాంక్షలు తెలిపిన ప్రియాంక చోప్రా

దక్షిణాది హీరోయిన్, మలయాళ నటి భావన తన మనసుకు నచ్చిన వ్యక్తిని మనువాడింది. దాదాపు ఐదేళ్ల పాటు సినీ రంగంలో కొనసాగుతున్న భావన వివాహం కన్నడ నిర్మాత నవీన్‌తో జనవరి 22 (సోమవారం) జరిగింది. కేరళ రాష్ట్రంలోని

దక్షిణాది హీరోయిన్, మలయాళ నటి భావన తన మనసుకు నచ్చిన వ్యక్తిని మనువాడింది. దాదాపు ఐదేళ్ల పాటు సినీ రంగంలో కొనసాగుతున్న భావన వివాహం కన్నడ నిర్మాత నవీన్‌తో జనవరి 22 (సోమవారం) జరిగింది. కేరళ రాష్ట్రంలోని త్రిచూరులో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. 2012లో నవీన్ నిర్మించిన కన్నడ చిత్రం ‘రోమియో’లో భావన హీరోయిన్‌గా నటించింది.
 
అప్పటి నుంచి వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని వదంతులొచ్చాయి. అయితే, వాటిని నిజం చేస్తూ గత మార్చిలో ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. తెలుగులో భావన చివరిగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ''మహాత్మ" (2009) చిత్రంలో హీరో శ్రీకాంత్ సరసన నటించింది.
 
ఇదిలా ఉంటే.. మలయాళ బ్యూటీ భావనకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో "హ్యాపీ మారీడ్ లైఫ్. నీ జీవిత ప్రయాణంలో ఇదొక పెద్ద అడుగు. గుడ్ లక్. నువ్వో గొప్ప ధైర్యవంతపు మహిళవు. నేను నిన్ను చాలా అభినందిస్తున్నాను" ప్రియాంక తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.